రేష్ ఆగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మెన్ టూ. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. మౌర్య సిద్ధవరం నిర్మాత. నేడు ప్రేక్షకుల మందుకురానుంది. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో మహిళలను ఎక్కడా విమర్శించలేదు. మగవాళ్ల కష్టాలను వినోదాత్మక కోణంలో చూపించాం అన్నారు. వినోదం, సందేశం కలబోసిన కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని నిర్మాత తెలిపారు. ఆడవాళ్లు మగవాళ్లను ఎలా టార్చర్ చేస్తారనే విషయాన్ని కామెడీ ప్రధానంగా చూపించారని బ్రహ్మాజీ చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-35.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-34.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-38.jpg)