
ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక పిల్లి కథానాయిక. డుయో నితిన్, భరత్ కలిసి దర్శకత్వం వహించారు. మాంక్స్ అండ్ మంకీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ప్రదీప్ మాట్లాడారు.సినిమా విడుదలకు ముందు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం. థియేటర్లలో ఆడియన్స్ నవ్వులు మా కష్టాన్ని మరిపించాయి. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ విడుదల చేయడంతో మా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు. ఆ ఫలితం తెరపై కనిపిస్తున్నది. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని ప్రదీప్ పేర్కొన్నారు. కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. ఇంకా దీపిక పిల్లి, గెటప్ శ్రీను, సంగీత దర్శకుడు రధన్, మైత్రీ శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.
