అప్సరారాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం మా ఇష్టం. మే 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. ఏప్రిల్ 8న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని వివాదాలతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాని విడుదల చేసేందుకు క్లియరెన్స్ వచ్చిందని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. మూడు భాషల్లో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని తెలుగులో మా ఇష్టం ఆపటానికి కుట్ర పని, ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ ఆధారంగా పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారని తెలిపారు. క్రింది కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని మే 6న విడుదల చెయ్యబోతున్నట్లు తెలిపారు.