Skip to main content

Namaste NRI

కంటెంట్‌ను నమ్ముకొని ఈ సినిమా చేశాం: విశాల్‌ చంద్రశేఖర్‌

రాకేష్‌ వర్రే హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం మాయలేడీ. ప్రశంకర్‌ దర్శకత్వం. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నిర్మాత రాకేష్‌ వర్రే మాట్లాడుతూ కంటెంట్‌ను నమ్ముకొని ఈ సినిమా చేశాం. సంగీత దర్శకులు విశాల్‌ చంద్రశేఖర్‌తో పాటు ప్రతిభావంతులైన టీమ్‌ ఈ సినిమా కోసం పనిచేశారు. మీ అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది. కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించే చిత్రమిది అన్నారు.

కమర్షియల్‌ హంగులతో సాగే ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌ ఇదని, కథలో ఎంచుకున్న పాయింట్‌ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుందని, ప్రేక్షకులు తెరపై ఓ కొత్త తరహా లవ్‌స్టోరీని చూస్తారని దర్శకుడు ప్రశంకర్‌ తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని చిత్ర కథానాయిక మధుమిత సర్కార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events