Namaste NRI

రాజమౌళి స్ఫూర్తితో ఈ సినిమా తీశాం.. వెంకట్‌ప్రభు  

దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం ది గోట్ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌). కథానాయికలు మీనాక్షి చౌదరి, స్నేహ. వెంకట్‌ప్రభు దర్శకత్వం.   హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ నేను దర్శకుడు రాజమౌళిగారికి పెద్ద అభిమానిని. ఈ సినిమా చేయడానికి ఆయనే స్ఫూర్తినిచ్చారు. ఇదొక హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌. హీరో విజయ్‌ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అన్నారు.

పుష్ప వంటి పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తమిళ నిర్మాత అర్చన కల్పాతి పేర్కొన్నారు. అద్భుతమైన విజన్‌తో దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ చిత్రాన్ని తీశాడని నటుడు ప్రశాంత్‌ అన్నారు. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events