Namaste NRI

మేము ఎన్నడూ అలాంటి వాగ్దానాలు చేయలేదు : జెడివాన్స్‌

అమెరికా , ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై గత నెల రోజులకు పైగా భీకర దాడికి పాల్పడింది. తాజాగా రెండువారాల పాటు ఇరాన్‌పై బాంబు దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అయితే ప్రకటించిన కొద్దిసేపటికే ఇజ్రాయిల్‌ లెబనాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో రెండు వందల మందికిపైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంలోకి లెబనాన్‌ వస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఈ వాదనల్ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ తోసిపుచ్చారు. ఈ విషయంపై తాజాగా ఆయన హంగేరిలో మీడియాతో మాట్లాడారు. శాంతి ప్రతిపాదనలో లెబనాన్‌ను చేర్చారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మేము ఎన్నడూ అలాంటి వాగ్దానాలు చేయలేదు అని సమాధానమిచ్చారు. ఈ కాల్పుల విరమణ ఇరాన్‌, అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ అరబ్‌ దేశాలకు మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌కు వర్తించదని ఆయన నొక్కిచెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events