భారత్‌ను అమెరికా కీలక భాగస్వామిగా చూస్తామని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్‌పియర్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లడంపై ఉన్న మా నిబద్ధతతోనే ఈ వ్యూహాత్మక బంధం నిర్మితమైందన్నారు. ఇరు దేశాల బంధం రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగుతుందన్నారు. ఇరు దేశాలు అంతర్జాతీయ చట్టాల అమలుకు శాంతి, సుసపన్నతకు, ప్రజల భద్రతకు కలిసి పనిచేస్తాయి. సవాళ్లను ఇరు దేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగిస్తామని వెల్లడిరచారు. అక్కడి ప్రజల స్వేచ్ఛకోసం పోరాడేందుకు అమెరికా 3 బిలియన్ డాలర్ల విలువైన భద్రతా సాయం మాత్రమే అందజేసింది. మేం ఉక్రెయిన్ ప్రజల వెంటే ఉన్నాం. మా మిత్రులు భాగస్వాముల్లోని ఐక్యతను చూడండి. నాటో మొత్తం ఒక్కటైంది. వారంతా బైడెన్ నాయకత్వంలో ఏకమయ్యారు. నాటో మరో రెండు దేశాలకు విస్తరించడం మీరు చూస్తునే ఉన్నారు. ఇది పశ్చిమ దేశాల్లో శక్తిని చూపిస్తుందన్నారు.