Namaste NRI

మన సంస్కృతిని భావితరాలకు అందించాలి : వెంకయ్యనాయుడు

సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ తరపున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడునూ ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేసింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలని, ఈ పనిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకటరమణ, సంతోష్ జూలూరి, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ కొల్లూరి, శశిధర్ రెడ్డి, నడికట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు కళాకారుల సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కవుటూరు రత్న కుమార్కు సొసైటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events