రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే, అంతలోనే ఆయన మరణించారని అన్నారు. తాజాగా జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు తన ముందు ఉంచి నట్లు చెప్పారు. ఇందుకు తాను అంగీకారం కూడా తెలిపినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన చర్చలు తుదిదశలో ఉండగా, అంతలోనే ఇలా జరిగిపోయిందన్నారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇది జీవితం అని పుతిన్ వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/laila-1-300x160.jpg)