ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ (తానా) అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా మద్దిపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో రూ.25 కోట్ల వ్యయంతో త్వరలో 150 క్యాన్సర్ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్యాన్సర్ శిబిరాలను గ్రేస్, బసవతారకం ఇండో అమెరికన్ ఫౌండేషన్‌లు సహకారం అందిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు తానా తరపున పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు.