రష్యా దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు అండగా ఉంటామని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి ( నాటో) పునరుద్ఘాటించింది. అమెరికా, నాటో విదేశాంగ మంత్రులు రొమేనియా రాజధాని బుకారెస్ట్లో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్ బర్గ్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద సైనిక కూటమి అయిన నాటాలో ఉక్రెయిన్ ఏదో ఒక రోజు భాగస్వామి అవుతుందని ప్రకటించారు. ఉక్రెయిన్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీయాలన్న రష్యా ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు.
