అమెరికాలో వ్యాపారవేత్తగా, అసోసియేషన్ నాయకురాలిగా సత్తా చాటిన ఝాన్సీ రెడ్డి నేడు పాలకుర్తి ప్రజలకు సేవలందించాలన్న ఉద్దేశ్యంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. తాను ఏ పని చేసినా, చేపట్టినా అందులో విజయం సాధించేవరకు కృషి చేస్తానని ఆమె చెబుతారు. ఆమె పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. కార్డియాలజిస్ట్ రాజేందర్ రెడ్డిని ఆమె వివాహం చేసుకున్న తరువాత అమెరికాలోనే వివిధ ప్రదేశాల్లో ఉంటూ అక్కడివారితో కలిసిమెలిసిపోయారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేసిన తరువాత ఆమె తరువాత రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారు. పురుషులతో సమావంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారం చేసి ఔరా అనిపించుకున్నారు. పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘రాజ్ ప్రాపర్టీస్’ సంస్థకు ఆమె సిఇఓగా వ్యవహరిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/revanth-reddy.jpg)
అలాగే అమెరికాలో చిన్నప్పటి నుంచి తెలుగువారి సమస్యలు చూసిన ఝాన్సీ రెడ్డి తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వారికి ఆసరాగా నిలవాలనుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో నిష్ణాతులైన మహిళలు ఇందులో సభ్యులు గా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్న లక్ష్యంతో ఆమె పని చేస్తున్నారు. అలాగే జన్మభూమిపై మమకారంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు అమె ఎంతో సేవలంది స్తున్నారు. గత 30ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకోసం ప్రభుత్వానికి ఇచ్చారు. తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పుట్టిన గడ్డ మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్ననలు అందుకున్న రaాన్సీరెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించి మరింతగా సేవలందించా లన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమెరికాలో రాహుల్ గాంధీని కలిసిన తరువాత టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆమెను అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ తరువాత వివిధ కారణాల వల్ల ఆమె మేనకోడలు ఝాన్సీ యశస్వినిరెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆమె గెలుపుకోసం ఝాన్సీ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అందరినీ కలుసుకుని, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్పిస్తూ, పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/rahulgandhi.jpg)
ఓటమికి దగ్గరలో ఎర్రబెల్లి దయాకర్ : ఝాన్సీ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రెగులా గ్రామం మరియు రెగులా తండా గడప గడపకు కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమంలో భాగంగా బతుకమ్మలతో, బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామం మహిళలు.అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేసింది ఏమీ లేదని కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డారని రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేటీఆర్, కెసిఆర్ ఖజానా నింపుకుంటే, పాలకుర్తిలో దగా దయాకర్ రావు మిషన్ భగీరథ పేరుతో నాణ్యతలేని పనులు చేసి వేల కోట్ల రూపాయలు తన ఖజానాలు వేసుకున్నాడు. రాష్ట్రంలో కేడీని, పాలకుర్తిలో ఈ దొంగని తరిమికొట్టేందుకు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/reddy.jpg)
దళిత బందు, రైతుబంధు, గృహలక్ష్మి, బీసీ బందు అని ఓట్ల కోసం మోసం చేయడం తప్ప ఎర్రబెల్లి చేసింది ఏమీ లేదు.ఓటమికి చాలా దగ్గరలో ఉనాడు ఎర్రబెల్లి, అందరూ ఓటు వేసే ముందు ఆలోచించాలి దౌర్జన్యం చేసే రాజ్యం కావాలా? మన బాగు చూసే ప్రభుత్వం కావాలా ఆలోచించండి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుండి ఒక సైనికునిలా పని చేయాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/jhansir-1.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/jhansireeddy.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/00ebbd52-1141-40cb-8de8-60e3069f4c0a-2-819x1024.jpeg)