రష్యా దాడిని తట్టుకుని నిలబడటమే గాక కచ్చితంగా విజయం సాధిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. ది డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, మిలటరీ కోసం వంట చేస్తున్న గ్రామస్థులు, యూనిఫాంలు కుడుతున్న టైలర్లు, ప్రమాదం ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులు తదితరులందర్నీ ఈ యుద్ధ సమయంలో తమ వంతుగా సాయం అందించినందుకు ప్రశంసించారు. తరచుగా క్షిపణి దాడులు, విస్తృత విధ్వంసం ఉన్నప్పటికీ వాటన్నింటని తట్టుకుని ఉక్రెనియన్లు తమ వంతుగా సేవలందించారని కొనియాడారు. తాము డబ్బు, పెట్రోల్, వేడి నీరు, వెలుతురు తదితరాలు లేకుండా కూడా ఉండగలం గానీ స్వేచ లేకుండా మాత్రం ఉండలేం అని అన్నారు.
