రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అనేక విధాలుగా సేవలందించామని, ఇక నుంచి పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అన్నారు. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ శత జయంతిని విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వరంలో విజయ డెయిరీ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా ప్యాక్టరీ ఆవరణలో ఉన్న కురియన్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ పాడి రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తన వంతు సహకారం అందచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరిని యూనియన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితి పాలకవర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, సమితి అధ్యక్షులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.