టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ నటించిన చిత్రం ఒక పథకం ప్రకారం. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం. ఈ సినిమాను గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సాయి రామ్ శంకర్ మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించి టీమ్ ఇటీవల ఓ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమా చూస్తూ ఇంటర్వెల్ టైమ్కి విలన్ ఎవరో చెబితే స్పాట్లో రూ. 10వేలు ఇస్తామని టీమ్ ప్రకటించిన ఛాలెంజ్తో, సినిమాపై బాగానే క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్కి కంటిన్యూ అన్నట్లుగా చిత్ర హీరో సాయి రామ్ శంకర్ తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మీడియాకు తెలియజేశారు.
రెస్పాన్స్ అయితే అద్భుతంగా వస్తుంది. సినిమా పేరు, రిలీజ్ అవుతుందన్న విషయం తెలియడానికి ఇది బాగా ఉపయోగపడింది. మొదటి నుంచి ఇదొక్కటే అనుకున్నాం. సినిమా చూశాక మా యూనిట్లో కీలక సభ్యులందరూ పట్టుకుంటే పదివేలు అని చెప్పడంతో, ఇదే ప్రమోషన్గా ఉపయోగించాలని ఫిక్స్ అయ్యాం. ఒక పథకం ప్రకారం అంటే 80 శాతం క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి ఒక పథకం ప్రకారం అనే టైటిల్ని టీమంతా ఆమోదించారు. ఫైనల్గా అదే సెలెక్ట్ చేసుకున్నాం. దర్శకనిర్మాతగా ఫాహద్ ఫాజిల్తో రెండు సినిమాలు నిర్మించారు. తెలుగులో కూడా అదే ప్యాట్రన్లో సినిమాలు చేస్తున్నారు. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ వినీత్. వీళ్లిద్దరూ కలిసి తెలుగులో చేద్దాం అనుకున్నపుడు ఇద్దరికీ నా పేరు మైండ్లోకి రావడం, నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.