Namaste NRI

మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాము .. డాలస్ తెలుగు డయాస్పోరాలో మంత్రి నారా లోకేశ్

తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమెరికా లో తెలుగువాళ్లు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. స్పీడ్‌కు ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. వాళ్లు వై నాట్‌ 175 అన్నారు. ప్రజలు మాత్రం వై నాట్‌ 11 అన్నారు.

ప్రవాసాంధ్రులకు ఏ కష్టం వచ్చినా ఏపీఎన్‌ఆర్టీ అండగా ఉంటుంది. విడాకులు, మిస్‌ ఫైర్‌లు, క్రాస్‌ ఫైర్‌లు లేకుండా ఎన్డీయే కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. రెడ్‌బుక్‌ తన పని తాను చేసుకుపోతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు. చంద్రబాబుని 53 రోజుల పాటు అక్రమంగా జైలులో ఉంచినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఎద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు అన్నారు.

2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికి తెలుసు. అందుకే సిద్ధం సిద్ధం అలని బయలుదేరిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్‌ హిట్‌ అయింది. రాబోయే రోజుల్లో రికార్డుల కూడా తిరగరాస్తాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లు ఉంటే, ఒక్క ఏపీలోనే డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ ఉంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం అని అన్నారు.

యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కూటమి ప్రభత్వు లక్ష్యం. పెట్టుబడుల కోసం అన్ని దేశాలకూ వెళ్తున్నాం. 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వాటిద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. పెట్టుబడుల ఒప్పందాలను రాబోయే మూడు నెలల్లో గ్రౌండిరగ్‌ చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు వేమూరి రవికుమార్‌, ఎన్‌ఆర్‌టీ టీడీపీ యూఎస్‌ఏ సమన్వయకర్త కోమటి జయరాం, టెక్సాస్‌లోని గార్లాండ్‌ నగర మేయర్‌ డైలాన్‌ హెడ్రిక్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events