క్రిమిమా ను ఎప్పటికీ రష్యా లో భాగంగా గుర్తించబోమని, ఈ విషయంలో అమెరికా ప్రతిపాదనను తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని, ఇకపై క్రిమియా రష్యాతోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది.

అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని పేర్కొనడం తమను షాక్‌కు గురిచేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. క్రిమియాను తాము ఎన్నటికీ రష్యాలో భాగంగా గుర్తించబోమని, అమెరికా ప్రతిపాదనను అంగీకరించబోమని తేల్చిచెప్పింది.
