గుజరాత్‌లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 141 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఇవాళ మా హృదయాలు భారత్‌తో ఉన్నాయని, వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తాను, జిల్ బైడెన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని బైడెన్ తెలిపారు. క్లిష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.
