భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తున్నామని అమెరికా తెలిపింది. అయితే చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలే నిర్ణయించాలని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ భారత్, పాక్ రెండిరటితోనూ బంధానికి అమెరికా విలువిస్తోందని అన్నారు. ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో భాగమన్నారు. పాక్ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు.