రష్యా-ఉక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావడానికి తాను సిద్ధమేనని హెచ్చరించారు. ట్రంప్ పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో సమావేశమయ్యారు. 1,000 రోజుల నుంచి జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలన్నారు. దీనిపై రష్యా స్పందిస్తూ, చర్చలకు సిద్ధమేనని తెలిపింది. కానీ జెలెన్‌స్కీ స్పందిస్తూ, ఏ ఒప్పందమైనా శాశ్వత శాంతికి దారి తీసేవిధంగా ఉండాలన్నారు.