భారత్-కెనడా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల అధినేతలు కలుసుకున్నా రు. జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో ఇద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను వెళ్లడం లేదని, అయితే కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నామని ట్రూడో చెప్పారు. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను తాము డీల్ చేస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు కెనడా ప్రధాని కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని పేర్కొంది. మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావటంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించింది.