
ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకున్న అమెరికాను ప్రస్తావిస్తూ ఇది అమెరికాకు పెద్ద చెంపపెట్టని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఖమేనీ ప్రసంగాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులను ప్రస్తావిస్తూ పెద్ద నష్టమేమీ జరగలేదని, అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందని వ్యాఖ్యానించారు.
