సాయిరామ్‌శంకర్ హీరోగా రూపొందిన చిత్రం వెయ్ దరువెయ్. యషా శివకుమార్, హెబ్బా పటేల్ కథానాయి కలు. నవీన్‌రెడ్డి దర్శకత్వం. దేవరాజు పొత్తూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీశ్‌శంకర్, శాసన సభ్యుడు కేవీ రమణారెడ్డి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ బంపర్ ఆఫర్, అమ్మా నాన్న తమిళమ్మాయి చిత్రాల్లోని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. తక్కువ సమయంలో సినిమాను అద్భుతం గా తీశాడు దర్శకుడు నవీన్‌రెడ్డి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. భీమ్స్ సంగీతం, సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అన్నారు.
దేవరాజుగారు పేషన్ ఉన్న నిర్మాత. కథను ప్రేమించారాయన. ఇక సాయిరామ్‌శంకర్ ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని నమ్మకంతో ఉన్నాం అని దర్శకుడు చెప్పారు. ఇంకా సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను కూడా మట్లాడారు. మార్చి 15న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీనారాయణ పొత్తూరు.