ప్రతిభావంతులైన విదేశీయులకు స్వాగతం పలకాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ వీసాలను ప్రవేశపెట్టనుంది. తద్వారా రానున్న పది నెలల్లో మరింత మంది విదేశీయులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత వీసా నిబంధనల్లో మినహాయింపులూ ఇన్వనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. నిపుణుల కొరత ఉన్న పరిశ్రమలు, సేవారంగాల్లో పనిచేసేవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.