అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని, సిరి, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వీకెండ్ పార్టీ. అమరేందర్ దర్శకుడు. బోయ చేతన్‌బాబు నిర్మించారు. సదా చంద్ర స్వరాలందించారు. ఈ చిత్ర పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకకు చంద్రబోస్, సుచిత్ర చంద్రబోస్, కాసర్ల శ్యామ్ తదితరులు హాజరయ్యారు. చంద్రబోస్ మాట్లాడుతూ ఈ సినిమాలో పల్లెటూరి నేపథ్యంతో సాగే పాట ఆకట్టుకుంటుంది. నా సతీమణి సుచిత్ర కొరియోగ్రఫీ చేశారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 90వ దశకంలో నాగార్జున సాగర్‌లో ఓ ఘటన జరిగింది. నలుగురు అమ్మాయిలు ఓ అబ్బాయిని రేప్ చేశారు. అదే ఘటనపై బోయ జంగయ్య అడ్డ దారులు అనే నవల రాశారు. దాన్నే ఇప్పుడు వీకెండ్ పార్టీ గా నేటి పరిస్థితులకు తగ్గట్లుగా తెరకెక్కించాం అన్నారు.