Namaste NRI

భీమదేవరపల్లి బ్రాంచి లో ఏం జరిగింది?

సుధాకర్‌ రెడ్డి, కీర్తిలత, అభిరామ్‌, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం భీమ దేవరపల్లి బ్రాంచి. రమేశ్‌ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఏబీ సినిమాస్‌, నిహల్‌ ప్రొడక్షన్స్‌పై బత్తిని కీర్తి లత గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలోని మల్లాపూర్‌ గ్రామంలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్య చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కిస్తున్నాం. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. దాని ఆధారంగానే ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి  సహనిర్మాత: రాజ నరేంద్ర చెట్టపెల్లి, సంగీతం: చరణ్‌ అర్జున్‌, ఛాయాగ్రహణం: చిట్టిబాబు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events