నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇంటి నెం. 13. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు. పన్నా రాయల్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిస్తున్నాం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందించాం. పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు పన్నా సినిమాని తెరకెక్కించిన తీరుతో నా నమ్మకం రెట్టింపయ్యింది. వచ్చే వారం టీజర్ విడుదత చేస్తామన్నారు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సినిమాకు సంగీతం : వినోద్ యాజమన్యా, సినిమాటోగ్రఫీ: పీఎస్ మణికర్ణన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)