ఆదిత్య బద్వేల్, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ఒక్కరోజు.. 48గంటలు. ఈ చిత్రానికి నిరంజన్ దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నిర్మాత. సెన్సారును పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ అమూల్యమైన ఒక డైమండ్ని రక్షించడానికి కథానాయకుడు టైం ట్రావెల్ని వాడుకుని ఎలా విజయం సాధించాడు అనేది కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా వుంటుంది అన్నారు. ఒక్కరోజు సినిమా ట్రైలర్ లాంచ్ త్వరలో సి కళ్యాణ్ గారి చేతులమీదుగా జరుగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్.
