సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తూన్న చిత్రం 7డేస్6 నైట్స్. మొహర్ చాహల్ నాయిక. ఈ చిత్రానికి ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యూత్‌పుల్ కంటెంట్‌తో యూత్‌కు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న చిత్రమిది. ఏడు రోజుల్లో కొందరు యువతీయువకుల జీవితాల్లో ఏం జరిగిందన్నది ఆసక్తిని పంచుతుంది. కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించాలన్న లక్ష్యంతో ఇలాంటి చిత్రాలు తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కో ప్రొడ్యూసర్స్: జె.శ్రీనివాస రాజు, మంతెన రాము. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
