పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మంగళవారం. అజయ్‌భూపతి దర్శకుడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా థియేటర్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్‌తో పాటు సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రం ఉంటుంది అన్నారు.