వేడి వేడి టీ అద్భుతమైన రుచిగా ఉండాలంటే కాసింత ఉప్పు వేయాలని బ్రిన్ మావ్ కాలేజ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ మిషెల్లీ ఫ్రాంక్ల్ ఇచ్చిన సలహా అమెరికా, బ్రిటన్ మధ్య వివాదాన్ని రేపింది. టీ బ్రిటన్ జాతీయ పానీయం కావడంతో ఆ దేశంతో సత్సంబంధాలు దెబ్బతింటా యేమోనని అమెరికా ఆందోళనకు గురైంది. వెంటనే లండన్లోని అమెరికన్ ఎంబసీ రంగంలోకి దిగింది. అమెరికన్ ప్రొఫెసర్ ఒకరు పర్ఫెక్ట్ టీ కోసం ఇచ్చిన సలహా బ్రిటన్తో తమకు గల ప్రత్యేక బంధాన్ని సల సల కాగుతున్న నీళ్లలో పడేసిందని వ్యాఖ్యా నించింది. టీలో ఉప్పు కలపడం అమెరికా అధికారిక విధానం కాదని స్పష్టం చేసింది. టీని మైక్రోవేవింగ్ చేసి, సరైన రీతిలోనే తయారు చేస్తామని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)