
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్న చిత్రం ఆర్‌కే దీక్ష. కిరణ్, ఆక్సఖాన్, అలేఖ్య రెడ్డి ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ జారీ చేశారని, దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చనే గొప్ప సందేశంతో ఈ సినిమా తీశామని ఆర్‌కే గౌడ్ తెలిపారు. ఇందులో తాను భీముని పాత్రలో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుందని హీరో కిరణ్ అన్నారు. ఈ సినిమాలో డ్యాన్సర్ పాత్రను పోషించాని ఆక్సఖాన్ తెలిపింది. జూన్ 12న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: డీఎస్ రెడ్డి, నిర్మాణం, దర్శకత్వం: ప్రతాని రామకృష్ణగౌడ్.















