మరోసారి జన్మతః పౌరసత్వాన్ని కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ ఆమోదించింది బానిసల పిల్లల కోసమే తప్ప ప్రపంచ ప్రజలంతా అమెరికాపై ఎగబడి తిష్ఠవేసేందుకు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జన్మతః పౌరసత్వాన్ని కల్పించే రాజ్యాంగ సవరణను ఆమోదించిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అది బానిసల పిల్లల కోసమేనని అర్థమవుతుందని అన్నారు. ప్రపంచంలోని ప్రజలంతా అమెరికాకు తరలివచ్చి ఇక్కడే తిష్ఠ వేసుకోవడానికి కాదని ఆయన చెప్పారు. ఎవరుపడితే వారు అమెరికా వచ్చేస్తున్నారని, అర్హతలు లేని వారు, అర్హతలు లేని పిల్లల కోసం ఇది ఉద్దేశించింది కాదని ట్రంప్ స్పష్టం చేశారు.