వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం నింద. కాండ్రకోట మిస్టరీ అనేది ఉపశీర్షిక. ఈ సందర్బంగా వరుణ్‌సందేశ్ విలేకరులతో ముచ్చటించారు. రొటీన్ సినిమాలతో విసుగొచ్చి, కాస్త విరామం తీసుకుందామని యూఎస్ వెళ్లాను. అక్కడ రాజేశ్‌గారు ఈ కథ చెప్పారు. ఆయన నేరేషన్ అద్భుతం. ఈ సినిమాను ఎవరు తీస్తారు? ఎవరు నిర్మిస్తారు? అనే ఆలోచన కూడా రాలేదు. ఆయనే దర్శక, నిర్మాత అని తెలిసి మరింత ఆనందం అనిపింది. గట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/Mayfair-100.jpg)
ఇందులోని నా పాత్రకు, నిజజీవితంలో నాకు అస్సలు పొంతన ఉండదు. నా వ్యక్తిత్వానికీ, మనస్తత్వానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా ఇందులో కనిపిస్తాను. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో ఇది ప్రత్యేకం. నెక్ట్స్ ఏంటి? అనేది ఎవరూ చెప్పలేరు. చేసిన మాకే క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్తుడెవరు? అనే విషయాన్ని ఎవరూ ఊహించలేరు. అమెరికాలో కూడా సినిమా విడుదల కానుంది అని తెలిపారు వరుణ్‌సందేశ్. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/Ixora-101.png)