Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. నిర్మాణ వ్యయం ఎంతంటే?

ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ది ముకాబ్‌ పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త నగరం న్యూ మురబ్బా లో దీనిని నిర్మిస్తున్నారు. 400 మీటర్ల ఎత్తు, వెడల్పుతో క్యూబ్‌ ఆకారంలో ఈ మహా నిర్మాణం ఉండనుంది. సౌదీ విజన్‌ 2030లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణానికి ఏకంగా 50 బిలియన్‌ డాలర్లు (రూ.4.20 లక్షల కోట్లు)ను వెచ్చించనున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ అయిన పబ్లిక్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(పీఐఎఫ్‌)లో భాగమైన న్యూ మురబ్బా డెవెలప్‌మెంట్‌ కంపెనీ(ఎన్‌ఎండీసీ) దీనిని నిర్మిస్తున్నది. 20 లక్షల మిలియన్‌ చదరపు మీటర్ల ఫ్లోర్‌ స్పేస్‌తో ఈ భవనం ఉంటుంది.

Social Share Spread Message

Latest News