ఏపీలో తెలుగు అకాడమీ పేరు మార్చడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలుగు అకాడమీని తెలుగుదేశం అకాడమీ అనుకున్నారేమో అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మాధ్యమాన్ని దూరం చేస్తున్నారని, తాజాగా తెలుగు అకాడమీని కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. 1968 నుంచీ భాషాభివృద్దికి తెలుగు అకాడమీ కృషి చేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఏపీలో తెలుగు అకాడమీ పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు అకాడమీ పేరును ‘తెలుగు సంస్కృత అకాడమీ’ గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి చోటు కల్పించారు.