రవితేజ, శ్రీ లీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనేది క్యాప్షన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వాట్స్ హ్యాపెనింగ్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను రమ్య బెహరా, భార్గవి పిళ్లయ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియో గ్రఫీ చేశారు. ఇదొక చక్కటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. రవితేజ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. నిర్హాణాంతర పనులు జరుగుతున్నాయి అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం డిసెంబరు 23న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం : భీమ్స్ సిసిరోలియో, సహనిర్మాత : వివేక్ కూచిభొట్ల, కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని.