ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిలిచిపోయాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా యాప్‌లు పనిచేయకపోవడంతో కారణాలు తెలియరాలేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ఫేస్‌బుక్ పేర్కొంది. అదే పనిలో ఉన్నామని, సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు ఫేస్‌బుక్ వైబ్‌సైట్‌లో పోస్టు పెట్టింది. భారత్‌లో రాత్రి తొమ్మిది గంటల నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు పలువురు ట్విట్టర్ ద్వారా వెల్లడిరచారు. భారతదేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)