ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో థీమ్ ఆఫ్ కల్కి పేరుతో లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరచిన ఈ గీతాన్ని చంద్రబోస్ రచించారు. కాలభైరవ ఆలపించారు.

కల్కి చిత్ర సారాంశాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట అర్థవంతంగా సాగింది. ఇటీవల ఈ గీతాన్ని మధురలో ఆవిష్క రించారు. అధర్మాన్ని అణిచేయగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమిదే .. స్వధర్మాన్ని పరిరక్షించగా.. సమస్తాన్ని ప్రక్షాళించగా..సముద్భవించే అవతారమిదే అంటూ ఈ పాట కృష్ణుడి శక్తియుక్తుల్ని ఆవిష్కరిస్తూ సాగింది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్ని పోషించారు. చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.
