రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రావణాసుర. సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రవితేజ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారని, యాక్షన్ ప్రధానంగా తనదైన శైలి స్టైలిష్ మేకింగ్‌తో దర్శకుడు సుదీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతదర్శకులు.