నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. కీర్తి సురేష్ కథానాయిక. సింగరేణి నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోదావరిఖని ప్రాంతంలో కొన్ని కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. దర్శకుడు నాని పూర్తి మాస్ పాత్రలో కనిపిస్తాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఫైట్స్: అన్బరివ్, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.