Skip to main content

Namaste NRI

సహా (లైఫ్‌ ఆఫ్‌ సంజు) విడుదల ఎప్పుడు?

శివకుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఎమోషనల్‌ డ్రామా సహా(లైఫ్‌ ఆఫ్‌ సంజు). నిశాంత్‌ దోటి దర్శకుడు. తేజ వెల్పుచర్ల నిర్మాత. సెప్టెంబర్‌ 4న థియేటర్లలో సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు శివకుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ మెట్రో రైల్‌లో ప్రయాణిస్తూ ఆత్మీయంగా కనిపిస్తున్నారు.


వీరిద్దరి పాత్రల మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఆవిష్కరించేలా ఈ స్టిల్‌ ఉన్నది. ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాల సంఘర్షణల చుట్టూ సాగే ఎమోషనల్‌ డ్రామా ఈ సినిమా అని మేకర్స్‌ తెలిపారు. వ్రజనా పాండ్యా, మహిపాల్‌, అప్పాజీ, భారతీ, మేఘన, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కరుణాకర్‌.కె, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: సుమైరా స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events