Skip to main content

Namaste NRI

సత్యదేవ్‌ జీబ్రా రిలీజ్‌ ఎప్పుడంటే

సత్యదేవ్‌, డాలీ ధనుంజయ లీడ్‌రోల్స్‌ చేస్తున్న యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ జీబ్రా. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌ అనేది ఉపశీర్షిక. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎస్‌.పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సత్యదేవ్‌, డాలీధనుంజయ్‌ ఉద్వేగం గా కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్లు, లైట్‌హౌస్‌, ఫ్యాక్టరీ మొదలైన ఎలిమెంట్స్‌ బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్నాయి. సత్యరాజ్‌, సునీల్‌, ప్రియా భవానీశంకర్‌, సత్య అక్కల, జెన్నిఫర్‌ పిషినోటా తదితరులు నటిస్తున్నారు. నవంబర్‌ 22న సినిమా విడుదల కానున్నట్టు పోస్టర్‌ ద్వారా మేకర్స్‌ తెలిపారు.  ఈ చిత్రానికి మాటలు: మీరాఖ్‌, కెమెరా: సత్య పొన్మార్‌, సంగీతం: రవి బస్రూర్‌, నిర్మాణం: పద్మజ ఫిల్మ్స్‌ ప్రై.లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News