మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 28. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేశ్ మరోసారి రెడీ అవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఎస్ థమన్ ఎస్ఎస్ఎంబీ 28కి మరోసారి సంగీతం అందిస్తుండటంతో, మరోసారి గూస్బంప్స్ తెప్పించే ఆల్బమ్ రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు మూవీ లవర్స్. మే 31న ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ గ్లింప్స్ తోపాటు టైటిల్ కూడా రెడీ అవుతున్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.