ఆర్ఆర్ఆర్ మూవీ కొత్తగా రెండు విడుదల తేదీన్ని ఖరారు చేసింది. అన్నీ అనుకూలమైతే మార్చి 18న విడుదలకి సిద్ధమనీ, లేదంటే ఏప్రిల్ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాయి ఆర్ఆర్ఆర్ సినీ వర్గాలు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించారు. ఒలివియో మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటించిన చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. రూ.400 కోట్లకి పైగా వ్యయంతో రూపొందిన ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదల తేదీపై ఓ స్పష్టతనిచ్చింది చిత్రబృందం. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యంతో పున ప్రారంభమైతే మార్చి 18న విడుదల చేయడానికి తాము సిద్ధమని ప్రకటించింది. లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)