Skip to main content

Namaste NRI

రూల్స్ మార్చేసిన వైట్‌హౌస్ …స్టూడెంట్‌ వీసా ఇక 4 ఏండ్లే!

అమెరికా స్టూడెంట్‌ వీసా విధానంలో రానున్న భారీ మార్పు అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా వేలాదిమంది భారతీయ విద్యార్థుల విద్య, కెరీర్లపై తీవ్ర ప్రభావం చూపనున్నది. సుదీర్ఘకాలంగా అమలులో ఉన్న డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానం స్థానంలో విద్యార్థి వీసాలపై నిర్దిష్టమైన కాలపరిమితిని విధించే కొత్త విధానాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించగా దానికి వైట్‌ హౌస్‌ ఆమోద ముద్ర వేసింది.

ప్రస్తుత డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానం కింద ఎఫ్‌-1 వీసా కలిగిన విద్యార్థులు, అదే విధంగా జే-1 ఎక్సేంజ్‌ విజిటర్లు, నిర్దిష్ట ఇతర వీసా హోల్డర్లు తమకు ఆమోదం లభించిన విద్యా కార్యక్రమంలో కొనసాగుతూ వీసా నిబంధనలను పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండవచ్చు. అయితే ప్రతిపాదిత నిబంధన ఈ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో అధికారిక నివాస కాలపరిమితిని నిర్దిష్టంగా నిర్ణయిస్తుంది. చాలామంది విద్యార్థులకు ఈ గరిష్ఠ పరిమితిని నాలుగేండ్లుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. ఈ నిబంధనను వైట్‌ హౌస్‌కు చెందిన మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ కార్యాలయం ఇప్పటికే సమీక్షించింది. ఇక అధికారికంగా దీన్ని ప్రకటించడమే మిగిలింది.

Social Share Spread Message

Latest News