విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం హిట్‌లిస్ట్. సూర్య కతిర్, కే.కార్తికేయన్ దర్శకత్వం వహించారు. ఆర్.కె.సెల్యూలాయిడ్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్ర హీరో సూర్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీజర్ చాలా బాగుంది. విజయ్ కనిష్కకీ, చిత్రబృందానికి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నా అన్నారు.
యాక్షన్, సస్పెన్స్ అంశాలతో పాటు నేర నేపథ్యంతో కూడిన కథ ఇది. మా సినిమాలో హిట్ లిస్ట్‌లో ఉన్నదెవరనేది తెరపైనే చూడాలి. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్రవర్గాలు చెప్పాయి. ఈ చిత్రానికి కెమెరా: కె.రామ్‌చరణ్, సంగీతం: పి.సత్య, కథ: ఎస్.దేవరాజ్, దర్శకత్వం: సూర్య కతిర్, కే.కార్తికేయన్.