చైనాతోపాటు పలు దేశాల్లో కొవిడ్-19 మహమ్మారి మరోదఫా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. 2020 నుంచి అమల్లో ఉన్న కొవిడ్-19 ఆంక్షల్లో సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే 500కి పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయని పేర్కొంది. చైనాలో తీవ్రస్థాయిలో కొవిడ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకరం అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)