Namaste NRI

చింతామణికి ఎవరు సొంత మొగుడు అవుతారు?

రాజేంద్రప్రసాద్‌, మధు ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం చింతామణి సొంత మొగుడు. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌ లో ఈ  సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌  బసిరెడ్డి పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ  టైటిల్‌ చూడగానే కొంత మంది వేరే విధంగా ఆలోచిస్తారు. చాలా మంది ఆర్టిస్ట్‌లు ఉన్న ఈ చిత్రంలో చింతామణికి ఎవరు సొంత మొగుడవుతారన్నది సప్పెన్స్‌. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రాన్ని శివ నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ హీరో రాజేంద్ర ప్రసాద్‌, ఆనంద్‌ భారతి, జబర్దస్త్‌ అప్పారావు, చిట్టి బాబు, ఎంఎస్‌ నాయుడు చెన్నెకేశవ, అవంతికి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events