2024లో అమెరికా అధ్యక్షపదవికి పోటీచేయాలనే జో బైడెన్ కు ఉన్నా ఇది అంత తేలిక అయ్యే పనికాదని స్పష్టం అవుతోంది. అధికార డెమోక్రాట్లు కొందరు బైడెన్ తిరిగి అధ్యక్ష బరిలోకి దిగడానికి అంగీకరించడం లేదు. 2024 చివరిలో అమెరికా ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక జరుగుతుంది. ఒక్క సారి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు ఇక చాలు. ఒక్క టర్మ్‌తో ముగిస్తే ఇతరులకు అవకాశం దక్కుతుంది కదా అని పార్టీకి చెందిన స్టీవ్ షర్ట్లెఫ్ తెలిపారు.
జో బైడెన్ పోటీకి డెమోక్రాట్లలో చాలా మంది తమకు అయితే ఇష్టం లేదని చెపుతున్నారు. జో బైడెన్ తిరిగి అధ్యక్ష పోటీకి దిగవచ్చా లేదా అనే విషయంపై గత నెలలో ఓ సర్వే జరిగింది. ఇందులో 37 శాతం మంది డెమోక్రాట్లు జో బైడెన్ పోటీ పట్ల సుముఖత వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల దశలో వ్యక్తం అయిన 52 శాతం అనుకూల ఓటు ఈ విధంగా దిగజారింది. విధానపరంగా కూడా జో బైడెన్ అధికార యంత్రాంగం చాలా పొరపాట్లకు దిగుతోందని, ప్రత్యేకించి అఫ్ఘనిస్థాన్ నుంచి గందరగోళం నడుమ అమెరికా సేనల నిష్కృమణ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక పార్టీలోని అభ్యుదయవాదులు ఎక్కువగా జో బైడెన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.